మలైకా అరోరాను పెళ్లాడబోతున్న అర్జున్ కపూర్..?

మలైకా అరోరాను పెళ్లాడబోతున్న అర్జున్ కపూర్..?

బాలీవుడ్ లో మలైకా అరోరాకు ఎలాంటి పేరు ఉన్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  సినిమాల్లో ప్రత్యేక నృత్యాలు అనగానే మలైకా అరోరానే గుర్తుకు వస్తుంది.  దబాంగ్, దబాంగ్ 2 సినిమాల ద్వారా ఆకట్టుకుంది.  సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న మలైకా.. ఇటీవలే ఆయన నుంచి విడిపోయింది. 

ఇప్పుడు బాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ ట్రెండ్ అవుతున్నది.  బాలీవుడ్ టాప్ వెబ్ సైట్ ఫిల్మ్ ఫేర్ కథనం ప్రకారం మలైకా అరోరా, నమస్తే ఇంగ్లాండ్ హీరో అర్జున్ కపూర్ లు 2019 లో వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాన్ని ప్రచురించింది.  గత కొంతకాలంగా ఈ ఇద్దరు చెట్టపట్టాలువేసుకొని తిరుగుతున్నారు.  రీసెంట్ గా మిలాన్ లో ఈ ఇద్దరు తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు.  ఈ పార్టీలు ఇద్దరు చేతులు కలుపుకొని కనిపించడంతో.. పుకార్లు బయటకు వచ్చాయి.  

అర్జున్ కపూర్, మలైకా అరోరాలు మంచి ఫ్రెండ్స్ అంటున్నప్పటికీ, క్లోజ్ ఫ్రెండ్స్ సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారని తెలుస్తున్నది.  ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదేమో.