త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ నటుడు ?

త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ నటుడు ?

అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.  భారీస్థాయిలో నిర్మితంకానున్న ఈ సినిమా కోసం స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు త్రివిక్రమ్.  ఇప్పటికే బన్నీ తల్లి పాత్ర కోసం టబును తీసుకోవాలనే యోచనలో ఉన్న ఆయన ప్రతినాయకుడి పాత్ర కోసం నానా పటేకర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.  ఈమద్యే 'కాల' సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన నానా పటేకర్ తమిళ సినిమాలు చేసినా ఇప్పటివరకు తెలుగు సినిమాలు చేయలేదు.  చూడాలి మరి ఆయన్ను త్రివిక్రమ్ ఎలా మెప్పించి సినిమాకు ఒప్పిస్తారో.