ఇర్ఫాన్ ఖాన్ ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?

ఇర్ఫాన్ ఖాన్ ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?

గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  లండన్ లోని ఓ ప్రఖ్యాత హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.  తాను సైన్ చేసిన సినిమాలు చేస్తూనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.  ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్ ఇండియా వచ్చి వెళ్ళాడట.  ఈ విషయం ఎవరికీ తెలియదు.  ఇర్ఫాన్ ఖాన్ కూడా మొన్నటి వరకు బయటపెట్టలేదు.  

ఇండియా వచ్చిన ఇర్ఫాన్ ఖాన్.. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి త్రయంబకేశ్వరంలోని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేయించారట.  పూజలు చేయించిన అనంతరం ఇర్ఫాన్ ఖాన్ లండన్ తిరిగి వెళ్లినట్టు తెలుస్తున్నది.  ఇండియా వచ్చాడని తెలిస్తే.. మీడియా హడావుడి, ఫ్యాన్స్ హంగామా ఉంటుందని.. అనారోగ్యం కారణంగా ఈ విషయాలను దాచిపెట్టి, గోప్యంగా దర్శనం చేసుకొని వెళ్లినట్టుగా తెలుస్తున్నది.