పంచ్‌ డైలాగుల... మహరాజా

పంచ్‌ డైలాగుల... మహరాజా

బాలీవుడ్‌ ఓ గొప్ప రైటర్‌ను కోల్పోయింది. ఒకతరం, ఒక మూసకు అలవాటు పడిన బాలీవుడ్‌ డైలాగ్స్‌కు కొత్త జోష్‌ చేసిన రచయిత ఖాదర్‌ఖాన్‌. సలీమ్‌ జావేద్‌ కథలకు ప్రాణం పోసేలా స్ర్కీన్‌పై డైలాగులు పండించిన గొప్ప రచయిత అతను. పాత తరం ఉర్దూను ఔపోస పట్టిన ఖాదర్‌... నేటి తరం హిందీకి పంచ్‌ డైలాగులను పరిచయం చేశారు. దుర్భర దారిద్ర్యంతో ఆరంభమైన ఆయన జీవితంతో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకున్న డైలాగ్‌ రైటర్‌ స్థాయి వరకు సాగింది. 250 సినిమాలకు మాటలు రాస్తే ..అందులో సగంపైనే సూపర్‌ డూపర్‌ హిట్స్‌. అమిత్‌ పోషించిన అనేక పాత్రలకు హావభావాలతో సహా... తదనుగుణంగా డైలాగ్స్‌ రాసిన ఖాదర్‌ ఖాన్‌ అంటే అమితాబ్‌కు ఎంతో ఇష్టం. చిన్న ఉద్యోగం చేస్తూ.. నాటకాల్లో నటిస్తూ..రాస్తూ వచ్చిన ఖాదర్‌ఖాన్‌ గొప్ప టీచర్‌. 

ఆరంభంలో ఆయన ఓ సినిమాలో పనిచేస్తున్నపుడు ఆయన పనిచేస్తున్న స్కూల్‌ విద్యార్థులందరూ వచ్చేశారు. సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని... టీచింగ్‌ చేయడానికి టైమ్‌ లేదంటే.. ఎంత రాత్రయిన సరే వెయిట్‌ చేస్తామని చెప్పిన విద్యార్థులు ఖాదర్‌ ఖాన్‌ క్లాస్‌ కోసం రాత్రి 12 గంటల దాకా వెయిట్‌ చేశారంటే ఆయన టీచింగ్‌ కెపాసిటి అలాంటి. ముఖ్యంగా ఖాదర్‌ ఖాన్‌ లెక్కలు చెప్పడంలో సూపర్‌. రాత్రి 12 గంటలకు ప్రారంభమైన క్లాసులు ఉదయం 5దాకా సాగేవి. మొత్తం విద్యార్థులు పరీక్ష పాస్‌ కావడంతో..తరవాత  ఆయన పూర్తిగా తన సమయం సినిమాలే కేటాయించారు. తన పరిశ్రమ అరంగేట్రం గురించి ఖాదర్‌ ఖాన్‌ పలు ఇంటర్వ్యూలలో చెప్పేవారు.  

రెండు మూడు సినిమాలకు పనిచేసిన తరవాత పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు ఖాదర్‌ ఖాన్‌. ఒకట్రెండు చిన్న సినిమాల తరవాత ఖాదార్‌ ఖాన్‌ గురించి తెలసని మన్మోమన్‌ దేశాయ్‌... తన చిత్రం షూటింగ్‌ పూర్తయిందని.. క్లయిమాక్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని...డైలాగ్స్‌ రాయమని చెప్పారు మన్మోహన్‌ దేశాయ్‌. కేవలం ఒకే ఒక రాత్రి డైలాగ్స్‌ రాసి తీసుకెళ్ళాడు ఖాదర్‌ఖాన్‌. మన్మోహన్‌ అపుడు తన వీధిలో పిల్లలతో క్రికెట్‌ ఆడుతున్నాడు. ఖాదర్‌ఖాన్‌ చూడగానే..ఈ బేవకూఫ్‌కి నేను చెప్పింది అర్థం కాలేదని అన్నాడు.. ఖాదర్‌ఖాన్‌ ఇంకా దగ్గరకు రాకుండానే. తీరా దగ్గరకు వచ్చిన ఖాదర్‌ ఖాన్‌.. సార్‌ మీరు నన్ను బేవకూఫ్‌ అని తిట్టారు. అలా తిట్టడం మంచిది కాదన్నాడు. తొలుత అలా తాను అనలేదని బుకాయించిన మన్మోహన్‌... ఖాదర్‌ఖాన్‌ను లిప్‌మూవ్‌మెంట్‌ను బట్టి మాటలు పట్టేస్తాడని అర్థమైంది. (నసీమ్‌ సినిమాలో హీరోయిన్‌ హేమమాలిని పాత్ర ఇలాంటిదే... అవతలి వ్యక్తి లిప్‌ మూవ్‌మెంట్స్‌ చూసి డైలాగ్స్‌ చెప్పేయడం). సరే ..రూమ్‌లోకి వెళ్ళి ఆయన ఖాదర్‌ఖాన్‌ చెప్పిన డైలాగ్స్‌ విన్న మన్మోహన్‌.. మరోసారి చెప్పమన్నాడు. మరోసారి...మరోసారి విన్నాడు. డైలాగ్స్‌ను రికార్డు చేశాడు. ఆ డైలాగ్స్‌కు మన్మోహన్‌ ఎంతగా ఫిదా అయ్యాడంటూ... రూమ్‌ అరుపులు కేకలు. ఆనందంతో పిచ్చోడిలా అరిచాడు. వెంటనే రూమ్‌లోకి వెళ్ళి  బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ తెచ్చి బహుమతిగా ఇచ్చేశాడు.  చేతిలోని గోల్డ్‌ బ్రాస్‌లెట్‌ కూడా. వెంటనే నీ ప్రైస్‌ ఎంత అని అడిగారు. అప్పటి ఆ మాట వినని ఖాదర్‌ ఖాన్‌. తనకు అలాంటిదేమీ లేదని...రఫూ చక్కర్‌ సినిమా కోసం  21వేలు తీసుకున్నానని చెప్పాడు. నా దగ్గర పనిచేసే రైటర్‌కు అంత తక్కువ రేటా... అంటూ లక్షా 21వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.  

అదాలత్‌ మూవీతో మొదలైన ఖాదర్‌ఖాన్‌ ప్రస్తానం సూపర్‌ డూపర్‌  హిట్‌ అయింది. అప్పటి దాకా కవిత్వాత్మకంగా సాగే డైలాగ్స్‌ ... చదువుకున్న వారికే అన్నట్లు భారీ పదాలతో,  లోతైన భావజాలంతో సాగిన బాలీవుడ్‌ డైలాగ్స్‌... ఖాదర్‌ఖాన్‌ రాకతో ఒక్కసారిగా మాస్‌ గల్లీలోకి వచ్చేసింది. ముకద్దర్‌ కా సికందర్‌లో ఆయన రాసిన ప్రతి డైలాగ్‌ ఆ రోజుల్లో దేశాన్నే  ఒక ఊపు ఊపేసింది. సీరియస్‌ సినిమాల నుంచి అమర్‌ అక్బర్‌ ఆంటోని, నసీబ్‌ వంటి కమర్షియల్‌ హిట్స్‌ వరకు అన్ని రకాల సినిమాలకు ఆయన మాటలు అందించారు. తొలుత విలన్‌గా ఆ తరవాత రాఘవేంద్రరావు తీసిన హిమ్మత్‌ వాలా (పద్మాలయా బ్యానర్‌పై) చిత్రంతో ఆయన కామెడీ పాత్రలు  చేయడం ప్రారంభించారు. 

సినిమా నిర్మాణం చాలా ఖరీదైన వ్యవహారం మారడం, బాలీవుడ్‌లో సరస్వతీ దేవికన్నా.. లక్ష్మీ దేవికి ప్రాధాన్యం తరగడంతో క్వాలిటీ చిత్రాలు .. బ్లాక్‌ బస్టర్లు రావడం తగ్గాయని అంటారు ఖాదర్‌ ఖాన్‌. ఇపుడు వస్తున్న చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ... వీటిలో రెండే రెండు లోపాలు ఉన్నాయని అన్నారు. ఒకటి సినిమా చూస్తున్నపుడు మనకు తెలియకుండా మన కళ్ళు చెమర్చడం రెండోది... మనకు తెలియకుండా మన ముఖంలో నవ్వు  రావడం... ఇవి రెండు ఇపుడు లేవని అన్నారు. ఇవి రెండు సినిమా మనసును తాకినపుడే వస్తాయని ఆయన పరోక్షంగా అన్నాడన్నమాట.