దేవదాస్ లో అతడినే ఎందుకు విలన్ గా తీసుకున్నారో..?

దేవదాస్ లో అతడినే ఎందుకు విలన్ గా తీసుకున్నారో..?

నాగార్జున, నానిలు హీరోలుగా వస్తున్న మల్టీస్టారర్ సినిమా దేవదాస్.  ఈ సినిమా సెప్టెంబర్ 27 న బ్రహ్మాండంగా విడుదల కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  మణిశర్మ అందించిన క్లాసికల్ ట్యూన్స్ అదరగోట్టాయి.  స్వరబ్రహ్మ ఈజ్ బ్యాక్ అనే విధంగా ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది.  

ఇందులో విలన్ గా మొదట రామ్ చరణ్ .. బోయపాటి సినిమాకు విలన్ గా చేసిన వివేక్ ఒబెరాయ్ ని అడగ్గా.. ఆయన ఏకంగా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడగడంతో.. పక్కన పెట్టి బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న కునాల్ కపూర్ ను విలన్ గా టాలీవుడ్ కు తీసుకొచ్చి పరిచయం చేశారట.  

అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి సినిమాలో నటించిన కునాల్ కపూర్ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఇటీవలే అక్షయ్ కుమార్ గోల్డ్ సినిమాలో హాకీ టీమ్ కు కోచ్ గా నటించాడు.  గోల్డ్ లో నటనతో ఆకట్టుకున్న ఈ కోచ్ ఇప్పుడు దేవదాస్ లో విలన్ గా కనిపిస్తున్నాడు.  విలన్ కు సంబంధించిన క్యారెక్టర్ ఎలా ఉన్నది అనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు.  త్వరలోనే కునాల్ కపూర్ కు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.  కోచ్ గా సక్సెస్ అయిన కునాల్.. విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.