నాగార్జున హీరోయిన్ ఇలా మారిపోయిందా..?

నాగార్జున హీరోయిన్ ఇలా మారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత వయసు వచ్చినా నటిస్తూనే ఉంటారు.  హీరోలకు వయసు పట్టింపు ఉండదు.  వారికి అభిమానులు ఉంటారు.  మార్కెట్ ఉంటుంది. హీరోయిన్ విషయంలో అలా కాదు.  30 దాటగానే అవకాశాలు తగ్గిపోతాయి.  నలభైకి వచ్చే సరికి మెయిన్ క్యారెక్టర్లు రావు.  అమ్మ, అక్క, అత్త క్యారెక్టర్లు చేసుకోవాలి.  కొంతమందికి అలా చేయడం ఇష్టం ఉండదు.  దీంతో వారు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంటారు.  

1990 లో వచ్చిన నేటి సిద్దార్ధ సినిమా గుర్తుంది కదా.  నాగార్జున హీరో.  అందులో ఓసి మనసా అనే సాంగ్ లో నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసిన అయోషా జుల్కా గుర్తుంది కదా.  ఆ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో కనిపించింది.  ఇటు తెలుగుతో పాటు హిందీలో అమీర్ ఖాన్ తో జో జీతా వహి సికిందర్ సినిమాలో నటించి దుమ్ము రేపింది.  2010 లో వచ్చిన అదా సినిమా తరువాత వెండితెర నుంచి దూరమైంది.  దాదాపుగా ఎనిమిదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది.

ఎనిమిదేళ్ల తరువాత ఇప్పుడు అనీల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న జీనియస్ అనే బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నదట.  హీరోయిన్ క్యారెక్టర్ అనుకునేరు.  అదేం కాదండి. హీరోయిన్ తల్లిగా అయోషా జుల్కా కనిపించబోతున్నది.  ఇటీవలే మీడియాకు కనిపించిన అయోషా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.  సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు ఫిజిక్ ను కాపాడుకుంటూ ఉండే తారలు.. ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాక ఎందుకు లావుగా మారిపోతారో అర్ధం కాదు.  మరలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆఫర్లు వస్తుంటే తిరిగి మామూలు స్థితికి మారిపోవడానికి జిమ్ కు పరుగులు తీస్తుంటారు.  ఇప్పుడు అయోషా జుల్కా కూడా అలాగే చేస్తుందా చూద్దాం.