క్యాన్సర్ కు బలైన బాలీవుడ్ నటి !

క్యాన్సర్ కు బలైన బాలీవుడ్ నటి !

ఈ మధ్య నటీ నటులు క్యాన్సర్ బారిన పడుతుండటం బాలీవుడ్ ప్రేక్షకుల్ని కలచి వేస్తోంది.   ఇప్పటికే ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో పోరాడుతుండగా, ఇటీవలే నటి సోనాలి బింద్రేకు కూడ క్యాన్సర్ ఉందని తేలింది. 

ఈ దుర్వార్తల నుండి తేరుకునేలోపు హిందీ ప్రేక్షకులు మరొక నటిని కోల్పోయారు.  కొన్నాళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న నటి సుజాత కుమార్ నిన్న రాత్రి 11 గంటల 26 నిముషాలకు తుది శ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆమె సోదరి సుచిత్ర కృష్ణ మూర్తి వెల్లడించారు.  సుజాత కుమార్ 'ఇంగ్లీష్ వింగ్లిష్'లో శ్రీదేవికి సోదరిగా నటించారు.  అంతేగాక బాలకృష్ణ, బోయపాటిల సినిమాలో కూడ ఈమె ఒక కీలక పాత్ర చేశారు.