హ్యాపీ మూడ్ లో మాజీ విశ్వసుందరి..!! 

హ్యాపీ మూడ్ లో మాజీ విశ్వసుందరి..!! 

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సర్వైవ్ కావాలి అంటే నిత్యం సోషల్ మీడియాతో టచ్ లో ఉండాలి.  సినిమా రంగానికి దూరంగా ఉంటున్న హీరోయిన్లు సైతం సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.  సినిమా రంగంతో టచ్ ఉంటె చాలు వాళ్ళను నెటిజన్లు ఫాలో అవుతుండటం సహజమే.  కొంతకాలం క్రితం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేసి మెప్పించిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. 

అంతేకాదు పెళ్ళికి దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటోంది.  తనకంటే వయసులో చిన్నవాడైన రోమన్ తో డేటింగ్ చేస్తూ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నది.  ఇక ఖాళీ సమయంలో సరదాగా బీచ్ లకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిజీ అయ్యింది.  తాజాగా ఓ బీచ్ ఫోటోను షేర్ చేసింది ఈ మాజీ మిస్ యూనివర్స్.  ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఆ ఫోటోపై మీరు ఓ లుక్కెయ్యండి.