చిరు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ..!!

చిరు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ..!!

చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం కొరటాల దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో బిజీగా ఉన్నారు.  ఇదిలా ఉంటె దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.  

ఇందులో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.  లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిరంజీవి 152 వ సినిమా కోసం బాలీవుడ్ నటి హుమా ఖురేషి ని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నది.  మెగాస్టార్ 150 వ సినిమాలో కాజల్, 151 వ సినిమాలో నయనతారలు నటించారు.  152 వ సినిమా కోసం అనేకమంది పేర్లను పరిశీలించినట్టుగా తెలుస్తున్నది.  చివరికి హుమా ఖురేషిని ఎంపిక చేశారని, చిరు సినిమాలో యాక్ట్ చేసేందుకు హుమా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం.