డ్రగ్స్ తీసుకుంటే ఫిట్ గా కనిపిస్తారు : నటి పాయల్

 డ్రగ్స్ తీసుకుంటే ఫిట్ గా కనిపిస్తారు : నటి పాయల్

బాలీవుడ్ నటి పాయల్ గోష్ బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం పై సంచలన విషయాలను వెల్లడించింది. చిత్ర పరిశ్రమలో పార్టీల సమయంలో మాదకద్రవ్యాల వాడకంపై చాలా చీకటి రహస్యాలను ఆమె వెల్లడించారు. పాయల్ గోష్ మీడియాతో మాట్లాడుతూ...అందరూ కాదు కానీ.. చాలా మంది సెలబ్రిటీలు పార్టీలలో డ్రగ్స్ వాడుతున్నారని, అయితే వారందరూ డ్రగ్స్ కు బానిసలని తెలిపింది. కొంతమంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల సన్నగా, స్లిమ్‌గా, చాలా యాక్టివ్‌గా కనిపిస్తారని పాయల్ అన్నారు.

ప్రజలు తమ అభిమాన తారలను అనుసరిస్తారని, ప్రముఖులు చాలా బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. డ్రగ్స్ తీసుకోవడం అభిమానులకు తప్పుడు సందేశం ఇస్తుందని పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్ ప్రముఖులలో డ్రగ్స్ కేసు భయాందోళనలను సృష్టిస్తుందని వెల్లడించింది.