మండుటెండల్లో వెన్నెల సునామి

మండుటెండల్లో వెన్నెల సునామి

షమా సికిందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఆమె గురించి అందరికి బాగా తెలుసు.  మొదటిలో బాలీవుడ్ లో చిన్న చితకా పాత్రలు చేసినా... తరువాత సీరియల్ రంగానికే పరిమితం అయ్యింది.  సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ భామ.  టీవీ, సినిమా పక్కన పెడితే.. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో మాత్రం షమాకు తిరుగులేదు.  పిచ్చెక్కించే ఫోటో షూట్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.  

రీసెంట్ గా ఓ బీచ్ లో వైట్ కలర్ బికినీలో మతిపోగొట్టింది.  ఈ ఫొటోతో పాటు ఓ పెద్ద ఫిలాసఫీ లెక్చర్ కూడా ఇచ్చింది.  మీ లోపల మరో గొంతు ఉంటుంది.  అక్కడి నుంచి చిన్నగా వాయిస్ వినిపిస్తుంది.  ఆ వాయిస్ ను విని పారిపోకండి.  అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.  గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేలా పురిగొల్పుతుంది.  మీలోని టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.." మెసేజ్ ను ఇచ్చింది. ఈ మెసేజ్ పై నెటిజన్లు కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు.