మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ?

మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ?

 

సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమా ముగియగానే అనిల్ రావిపూడి సినిమానుస్ స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు టీమ్.  తాజా సమాచారం మేరకు ఇందులో బాలీవుడ్ నటిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట టీమ్.  ఆమె మరెవరో కాదు సోనాక్షి సిన్హా.  మొదటగా ఇందులో సాయి పల్లవి, రష్మిక మందన్న నటిస్తారనే వార్తలు వచ్చినా ఇప్పుడు సోనాక్షి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  మరి వీటిలో ఏ వార్త నిజమో తేలాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సిందే.