తెలుగులోకి భారీ బాలీవుడ్ చిత్రం !

తెలుగులోకి భారీ బాలీవుడ్ చిత్రం !

ప్రస్తుతం హిందీలో రూపొందుతున్న భారీ సినిమాల్లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' కూడ ఒకటి.  అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రిన కైఫ్, ఫాతిమా సనా షేక్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాను తెలుగులోకి కూడ డబ్ చేయనున్నారు.  అమీర్ ఖాన్ 'దంగల్' తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఉండటం, అమితాబ్ చిరు యొక్క 'సైరా' సినిమాలో నటిస్తుండటంతో ఈ అనువాదానికి మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి. 

అక్టోబర్ నెల నుండి తెలుగు డబ్బింగ్ పనులు మొదలుకానున్నాయి.  సుమారు 150 కోట్లతో యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన నటీనటులు ఫస్ట్ లుక్స్ బాగా సక్సెస్ అయ్యాయి.