బాలీవుడ్ బయోపిక్ డే..!!

బాలీవుడ్ బయోపిక్ డే..!!

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25 వ తేదీన బాలీవుడ్ లో రెండు బయోపిక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.  రిలీజైన రెండు.. మంచి పేరు తెచ్చుకున్నాయి.  ఈ రెండు కూడా చారిత్రాత్మక నేపధ్యం కలిగిన సినిమాలే కావడం విశేషం.  ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక... అప్పటి చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో సఫలం అయింది. ఝాన్సీ రాణి వీరోచిత పోరాటం.. రాజ్యంలో అంతర్గతంగా ఎదురయ్యే ఇబ్బందులను స్పష్టంగా చూపించి సఫలం అయ్యారు.  క్రిష్ మధ్యలో వదిలేసిన సినిమాను కంగనా రనౌత్ సూపర్బ్ గా హ్యాండిల్ చేసింది.  

ఇక ఈ సినిమాతో పాటు బాల్ థాకరే జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమాకూడా రిలీజ్ అయ్యింది.  థాకరే జీవితం తెరిచిన పుస్తకం వంటిది. ఒక కార్టూనిస్టుగా జీవితాన్ని స్టార్ట్ చేసిన థాకరే, ముంబై నగరంలో మరాఠీలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోతాడు.  మరాఠీల కోసం ఫైట్ చేసే యోధుడిగా థాకరే ఎదిగిన తీరు కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు సుర్జీత్.  వివాదాస్పదమైన సన్నివేశాలు, డైలాగులు ఉన్నప్పటికి బయోపిక్ సినిమా కాబట్టి జరిగింది జరిగినట్టుగా చూపించాలి కాబట్టి ఆ డైలాగులను అలాగే ఉంచారు.  మహారాష్ట్రలో ఈ సినిమా విజయఢంకా మ్రోగించింది.  మొదటిరోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా.. రిపబ్లిక్ డే హాలిడే, సండే వరసగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా దూసుకుపోతాయి అనడంలో సందేహం లేదు.