ఆ ఫోటో షేర్ చేసి.. నెటిజన్ల చేత తిట్లు తిన్న దీపికా

ఆ ఫోటో షేర్ చేసి.. నెటిజన్ల చేత తిట్లు తిన్న దీపికా

దీపికా.. రణ్వీర్ సింగ్ వివాహం నవంబర్ 20 వ తేదీన ఇటలీలోని కొమో లేట్ అందాల మధ్య జరుగబోతున్న సంగతి తెలిసిందే.  ఈ వివాహానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. వరల్డ్ ఫోటోగ్రఫి డే రోజున దీపికా ఓ ఫోటోను షేర్ చేసింది.  ఫోటో బ్యూటిఫుల్ గా ఉంది.  అందులో ఉన్న ఫోటోను ను జాగ్రత్తగా గమనిస్తే.. మనకు ఒకటి అర్ధం అవుతుంది.  ఆ ఫోటోలో ఓ రాక్ మీద బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ కూర్చొని ఉంటాడు.. దీపికా ఫోటో తీస్తూ ఉంటుంది.  ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫి డే అని షేర్ చేసింది.  

రన్బీర్ కపూర్, దీపికా పదుకొనెలు ఇద్దరు చాలా కాలం ప్రేమించుకున్నారు.  చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.. ఇద్దరు ఫ్యూచర్లో వివాహం చేసుకుంటారు అనుకునేలోపే విడిపోయారు.  వీరు విడిపోవడంతో బాలీవుడ్ నుంచి సామాన్యల వరకు అంతా షాక్ అయ్యారు.  రన్బీర్ కపూర్ నుంచి విడిపోయాక దీపికా పదుకొనె.. రణ్వీర్ సింగ్ ప్రేమలో పడింది.  ఇప్పుడు ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు.  ఈ సమయంలో దీపికా షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వివాహం పెట్టుకొని ఇలాంటి ఫోటోను ఎలా షేర్ చేస్తారని అంటున్నారు.  మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి.. దీపికా చీటింగ్ చేస్తుందని, దీపికను పెళ్లి చేసుకోవద్దని నెటిజన్లు అంటున్నారు.  పాపం ఫోటోను షేర్ చేసి దీపికా ఇరకాటంలో పడింది.  

 

 

Capturing Moments ???????? #WorldPhotographyDay

A post shared by Deepika Padukone (@deepikapadukone) on