కాస్త ఆ ఫ్లేవర్ తగ్గిస్తే మంచిదేమో..!!

కాస్త ఆ ఫ్లేవర్ తగ్గిస్తే మంచిదేమో..!!

ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.  తెలుగు పదాలు ఉన్నాయా ఎన్నున్నాయి అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  

అసలు సాంగ్ ఏంటో అర్ధంగాక పాపం ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.  వినడానికి సాంగ్ తెలుగులో కంటే హిందీలో బాగుంది అనే టాక్ వచ్చింది.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు మంచిదే.  కాకపోతే.. ఇందులో టాలీవుడ్ కు కాస్టింగ్ ఎంతమంది ఉన్నారు అన్నది తెలియడం లేదు.  బాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో తెలుగు కంటే బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అన్నది సందేహంగా మారింది.  

బాహుబలి బాలీవుడ్ లో హిట్ కావడానికి రాజమౌళి స్ట్రాటజీతో పాటు, సినిమాలో కంటెంట్ కూడా కారణం అయ్యింది.  ఏది ఏమైనా ఒక సినిమా హిట్ కావాలంటే భారీ యాక్షన్ కంటే అందులో ఉండే కంటెంట్ ముఖ్యం.  కంటెంట్ ను ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తే సినిమాకు అంత పాపులారిటీ వస్తుంది.  మరి చూద్దాం.. ఎలా ఉంటుందో.