కేంద్రమంత్రితో అమీర్ ఖాన్ భేటీ

కేంద్రమంత్రితో అమీర్ ఖాన్ భేటీ

కేంద్రమంత్రి సురేష్ ప్రభును బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కలిశారు.  అమీర్ ఖాన్ సురేష్ ప్రభును కలవడం వెనుక రాజకీయ కారణాలు లేకపోయినా.. సామాజిక కారణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. మహారాష్ట్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అమీర్ ఖాన్ కేంద్రమంత్రితో విన్నవించినట్టుగా సమాచారం.  

మహారాష్ట్రను బాధిస్తున్న సమస్యల్లో ఒకటి నీటికొరత సమస్య.  ఈ నీటి కొరత కారణంగా చాలా ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి.  నీటి కొరతకు పరిష్కారం చూపించాలని మంత్రికి అమీర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.  మహారాష్ట్రలోని వాతావరణం కూడా ఇందుకు కారణం కావొచ్చు.  వాతావరణంలో మార్పులు తీసుకునేందుకు ఎలాంటి చర్యలో తీసుకోవాలి అనే దానిపై కూడా అమీర్ ఖాన్ మంత్రితో చర్చించినట్టుగా తెలుస్తున్నది.