జాన్ అబ్రహం vs సల్మాన్ ఖాన్.. గెలుపెవరిది..?

జాన్ అబ్రహం vs సల్మాన్ ఖాన్.. గెలుపెవరిది..?

బాలీవుడ్‌ అగ్రహీరోల్లో జాన్ అబ్రహం కూడా ఒకడు. అతడు తాజాగా చేస్తున్న సినిమా సత్యమేవజయతే2. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా మే14న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో జాన్ అబ్రహం తెలుపు కుర్తాపైజామా ధరించి, తలకు తలపాగా కట్టుకొని భారత దేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదుల కానున్న మే 14న మరో బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ సినిమా కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. సల్మాన్ చేసిన రాధే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మే14కు ఫైనల్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి పోరు భారీగా ఉండనుందని అభిమానులు అంటున్నారు. సల్మాన్ రాధే సినిమా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో దిశాపటానీ కూడా నటిస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరైనా వెనక్కు తగ్గుతారా లేదంటే పోరుకు సై అంటూ మే14న బాక్సాఫీస్‌ వద్ద తలపడతారా అనేది తెలియాల్సి ఉంది. వేరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది తెలియాలంటే మే14 వరకు ఆగాల్సిందే.