సుధీర్ బాబుకి బాలీవుడ్ హీరో సపోర్ట్ !

సుధీర్ బాబుకి బాలీవుడ్ హీరో సపోర్ట్ !

'సమ్మోహనం' తరవాత సుధీర్ బాబు చేసిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'.  ఈ చిత్రాన్ని స్వయంగా సుధీర్ బాబు నిర్మించడం విశేషం.  ఈ చిత్ర ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ద్వారా విడుదలచేశారు.  

సుధీర్ బాబు గతంలో టైగర్ ష్రాఫ్ నటించిన 'బాఘి' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే.  ఆ స్నేహం కారణంగానే టైగర్ ష్రాఫ్ ఈరోజు ట్రైలర్ ను లాంచ్ చేశారు.  ఆర్.ఎస్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాబా నటేష్ కథానాయకిగా నటించింది.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఈ నెల 21న విడుదలచేయనున్నారు.  

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి