నానికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ?

నానికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ?

ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ డైరెక్షన్లో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇది కాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటితో కూడా ఒక సినిమా ఒప్పుకుని ఉన్నాడు నాని.  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉంది.  తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో నానికి జోడీగా బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరిని తీసుకోవాలని దర్సక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది.  అదితి తెలుగులో చేసిన మొదటి చిత్రం 'సమ్మోహనం' సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో రూపొందింది.  ఈ చిత్రంతో ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది.