అర్జున్ రెడ్డి కంటే ఘాటెక్కువైంది..!!

అర్జున్ రెడ్డి కంటే ఘాటెక్కువైంది..!!

మాములుగా మనం అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దులు ఎక్కువయ్యాయని.. ఎందుకు ఇంతదారుణంగా ముద్దులు పెట్టుకుంటున్నారని వాపోతుంటారు. ఒకప్పుడు ముద్దులంటే ఆకులు, చెట్లు చేమలు వంటివి చూపించేవారు.  అప్పట్లో ముద్దులకు సినిమాలు దూరంగా ఉండేవి.  ఇప్పుడు కాలం మారింది.  సినిమా కమర్షియల్ అయ్యింది.  ఈ కమర్షియల్ యుగంలో ముద్దులు ఉంటేనే సినిమా అనే రీతిగా మారింది.  

అందుకే సినిమాలో ముద్దులను గంపలు గంపలుగా ఉంటున్నాయి.  ఎక్కడా తగ్గడం లేదు.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఇది మరింతగా పెరిగింది.  బాలీవుడ్ లో ముద్దు సంస్కృతీ పాతదే అయినా... అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో ఈ ముద్దు ఘాటు బాగా పెరిగింది.  గుంటూరు మిర్చే కారం అనుకుంటే శ్రీకాకుళం ఘాటు చూపించినట్టుగా కబీర్ సింగ్ లో ముద్దుల డోస్ ను అమాంతం పెంచేశారు.  డోస్ ఎక్కువ కావడంతో పాపం బాలీవుడ్ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారట.  ఏంటి ముద్దులు.. వామ్మో అని మరి ఇంతలానా అని కామెంట్స్ చేస్తున్నారు.