బాలీవుడ్ దిగ్గజ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ దిగ్గజ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా అయన కెనడాలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  కాగా, భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 ఙత్నాల సమయంలో కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఉన్న ఆఫ్గనిస్తాన్ లో జన్మించిన ఖాదర్ ఖాన్ 1973లో దాగ్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.  బాలీవుడ్ లో దాదాపు 300 సినిమాల్లో నటించిన ఖాదర్, 250 సినిమాలకు డైలాగులు రాశారు.  ఖాదర్ ఖాన్ లేరని తెలుసుకున్న బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఆయన మృతికి పట్ల సంతాపం తెలియజేసింది.