మహేష్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో

మహేష్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో

మహేష్ బాబు హీరోగా సినిమాలు, యాడ్స్ చేస్తూనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు.  మరోవైపు విస్తరిస్తున్న డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు.  అధునాతన టెక్నాలజీని వినియోగించుకొని నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ అందరిని ఆకట్టుకుంటోంది.  ఒకసారి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు మళ్ళీ మళ్ళీ ఆ థియేటర్ కు రావాలని కోరుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  

ఇదిలా ఉంటె, ఇప్పుడు మహేష్ బాటలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నడవబోతున్నాడు. అజయ్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు.  నార్త్ ఇండియాలో రూ.600 కోట్లతో 250 స్క్రీన్స్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు అజయ్ దేవగణ్.  పెట్టిన డబ్బులను తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా బిజినెస్ ను ప్లాన్ చేస్తున్నారట.  ఇది వర్కౌటైతే... మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ రంగంలోకి అడుగుపెడతారేమో.