సల్మాన్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు

సల్మాన్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు

రేస్ 3 తరువాత సల్మాన్ ఖాన్ భారత్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.  ఈ ఏడాది ఈద్ కు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  దీని తరువాత ఈ స్టార్ హీరో దబాంగ్ సీరీస్ లోని దబాంగ్ 3 లో నటిస్తున్నాడు.  

సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదోఒక సమస్య వస్తూనే ఉన్నది.  దబాండ్ 3 ప్రారంభం సమయంలో శివలింగం గొడవ జరిగింది.  దాని నుంచి బయటపడేందుకు సల్మాన్ చాలా రిస్క్ తీసుకోవలసి వచ్చింది.  తాజాగా మండు రాజమహల్ గొడవ తెరపైకి వచ్చింది.  

మండు రాజమహల్ షూటింగ్ సమయంలో నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేయకపోవడం వలన మహల్ దెబ్బ తినిందని పురావస్తు అధికారులు సల్మాన్ కు నోటీసులు జారీ చేశారు.  మరి ఈ నోటీసులపై సల్మాన్ ఎలా రిప్లయ్ ఇస్తారో చూడాలి.