22 సినిమాలు... రూ.200 కోట్లు

22 సినిమాలు... రూ.200 కోట్లు

సినిమా అన్నది ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది.  ఒకప్పుడు సినిమాకు 10 లేదా 20 కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు వంద నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది.  దీనికి తగ్గట్టుగానే మార్కెట్ జరుగుతున్నది.   దీంతో ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఓ అరుదైన నిర్ణయం తీసుకున్నాడు.  తాను నటించిన సినిమాల్లోని 22 సినిమాల శాటిలైట్ హక్కులను ఓ శాటిలైట్ ఛానల్ కు ఇచ్చేశారట.  ఈ 22 సినిమాలను రూ.200 కోట్లకు ఓ శాటిలైట్ సంస్థ తీసుకుంది.  స్వదేశ్, ఓం శాంతి ఓం, దిల్వాలే, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూఇయర్, డియర్ జిందగీ, చమత్కార్ వంటి సినిమాలు ఉన్నాయి.