కరణ్ జోహార్ సినిమాలో విజయ్ దేవరకొండ..?

కరణ్ జోహార్ సినిమాలో విజయ్ దేవరకొండ..?

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా సినిమాలతో విజయ్ దేవరకొండ సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఈ హీరో నటించిన అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ హీరో ఇప్పుడు సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళబోతున్నట్టుగా వార్తలుఅందుతున్నాయి.  కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.  

బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలని కరణ్ జోహార్ భావించాడు.  ప్రభాస్ బిజీగా ఉండటంతో.. ప్రభాస్ కోసం తయారు చేసిన కథతో విజయ్ హీరోగా చేయబోతున్నారని సమాచారం.  మరి ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాల్సి ఉన్నది.