బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ కు తీవ్ర అస్వస్థత

బాలీవుడ్ నటుడు ఖాదర్  ఖాన్ కు తీవ్ర అస్వస్థత

వెటరన్ బాలీవుడ్ నటుడు, రచయిత, నిర్మాత ఖాదర్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  81 సంవత్సరాల వయసు కలిగిన ఈ నటుడు ప్రస్తతం కెనడాలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉండటంతో.. వెంటిలేటర్ పై శ్వాసను అందిస్తున్నారు. 

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు.  హిట్ సినిమాల్లో నటించారు.  ముఖ్యంగా అమితాబ్ నటించిన చాలా సినిమాలకు ఆయన రచనా సహకారం అందించారు.  ఖాదర్ ఖాన్ వీలైనంత త్వరగా కోలుకోవాలని అమితాబ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.