రజిని సినిమాకు విలన్ దొరికాడోచ్..!!

రజిని సినిమాకు విలన్ దొరికాడోచ్..!!

రజినీకాంత్ పెట్ట తరువాత చేస్తున్న సినిమా దర్భార్.  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఏప్రిల్ 10 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన దర్బార్, ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది.  పవర్ఫుల్ కాప్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది.  

బాలీవుడ్ నటుడు ప్రదీప్ బబ్బర్ ను విలన్ రోల్ కోసం ఎంపిక చేశారు. జానే తూ జానే నా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఛిచ్చోరే, బ్రహ్మాస్త్ర సినిమాల్లో నటిస్తున్నాడు.  మురుగదాస్ సినిమాల్లో బాలీవుడ్ నటులు విలన్లుగా చేయడం ఇదేమి కొత్తకాదు. గతంలో తుపాకీ, కత్తి సినిమాల్లో నటించిన విలన్లు బాలీవుడ్ నటులే.  పొంగల్ స్పెషల్ గా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.