కోల్‌కతా డమ్‌-డమ్‌ రైల్వేస్టేషన్ లో కలకలం

కోల్‌కతా డమ్‌-డమ్‌ రైల్వేస్టేషన్ లో కలకలం
కోల్‌కతాలోలోని డమ్‌-డమ్‌ కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్ లో బాంబు పేలుడు సోమవారం కలకలం రేపింది. కోల్‌కతాలోని కంటోన్మెంట్‌ రైల్వే లైన్‌ ఏరియాలో నాటు బాంబులు పేలడంతో పలువురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరందరిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో మరో 10 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క సారిగా బాంబులు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదుచేసుకున్నపోలీసులు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నాటుబాంబులు ఎవరినైనా హత్యచేసేందుకు పెట్టారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.