ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుడు.. 40 మంది మృతి

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుడు.. 40 మంది మృతి

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారీ బాంబు పేలుడు జరిగింది.  ఈ పేలుళ్లలో 40 మంది మృతి చెందగా 100కి పైగా గాయపడ్డారు.  శనివారం సాయంత్రం కాబూల్ లో ఓ పెళ్లి వేడుక జరిగింది.  ఈ వేడుకకు దాదాపు 1000 మందికి పైగా హాజరయ్యారు.  ఈ సమయంలో అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి.  అయితే, ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు.  స్థానిక ఇస్లాం ఉగ్రముఠాలతో కలిసి తాలిబన్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అఫ్గాన్‌ లోని అమెరికా సైనిక బలగాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధానికి తెరదించేందుకు చర్చలు తుది దశకు చేరుకుంటున్న వేళ ఇలాంటి దుర్ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.