బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు

 బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు

తమిళనాడు తిరునెల్వేలి జిల్లా తిరువెంగడం సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ సహా ఆరుగురు దుర్మరణం చెందారు. కార్మికులు బాణసంచా తయారీలో ఉండగా ఓ గదిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం విన్న పోలీసులు, స్ధానికులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేశారు.