సూర్యాపేట జిల్లాలో కలకలం

సూర్యాపేట జిల్లాలో కలకలం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో కలకలం రేగింది. ఓ కుక్క బాంబును నోట కరుచుకుని వెళ్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ కుక్క అక్కడిక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టారు.