హైదరాబాద్‌లో బాంబు కలకలం..

హైదరాబాద్‌లో బాంబు కలకలం..

హైదరాబాద్‌లో మరోసారి బాంబు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది... నిత్యం రద్దీగా ఉండే అమీర్‌పేట్‌ ఏరియాలో అనుమానిత వస్తువు ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. అమీర్‌పేట్‌ మెట్రో పిల్లర్ దగ్గర బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, తనిఖీలు నిర్వహించారు. అది బాంబు కాదు.. పెయింట్ డబ్బాగా పోలీసులు గుర్తించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.