పోలీసులను పరుగెట్టించిన ఫేక్ కాల్

పోలీసులను పరుగెట్టించిన ఫేక్ కాల్

తిరుపతి రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదరింపు కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. హుటాహుటిన చేరుకున్న పోలీసులు , స్టేషన్ అంతా గాలించారు. అయితే అది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో ట్రాక్ చేయగా  ఆ యువకుడు పోలీసులకు చిక్కాడు. వెంటనే ఆ యువకుడి  లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతితో పాటు పుత్తూరు రైల్వే స్టేషన్ కు ఫొన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.