సీఎం ఇంటిని పేల్చేస్తాం...కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌ చేసిన యువకుడు

సీఎం ఇంటిని పేల్చేస్తాం...కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌ చేసిన యువకుడు

తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంటిపై,కార్యాలయంపై బాంబు దాడి చేస్తామని గుర్తు తెలియని యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌ను ఫోన్‌ చేశాడు....బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు...పోలీసులు మరియు బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌ టీంలు రంగంలోకి దిగాయి...సిఎం ఇంటిలో పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్‌ కాల్‌ అని నిర్ధారించుకోని అధికారుల ఊపిరి పీల్చుకున్నారు...ఫోన్‌ చేసిన యువకుడి కోసం సైబర్‌ క్రైం గాలింపు చేపట్టింది...
ఈ బెదిరింపుతో చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం,మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో సచివాలయం వద్ద భద్రతను పెంచారు...ఈ పరిసరాలును భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నాయి...గత కొన్ని రోజులుగా సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది..తాజా ఫోన్‌ కాల్‌తో సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. . సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు...