మణికర్ణికను ఆపలేం

మణికర్ణికను ఆపలేం

కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రతో పాటు.. దర్శకురాలిగా మెగాఫోన్ పట్టుకొని సినిమాను ముందుకు నడిపించింది.  జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాను మధ్యలో వదిలేసిన సంగతి తెలిసిందే.  ఝాన్సీ లక్ష్మీభాయ్ ను తప్పుగా చూపిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన హైకోర్ట్ లో కేసు ఫైల్ చేసింది.  

ఈ పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్ట్, మణికర్ణిక రిలీజ్ ను ఆపలేమని చెప్పింది.  అయితే, సినిమాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని దర్శక నిర్మాతలను ఆదేశించింది.  మణికర్ణిక రేపు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదల కాబోతున్నది.