బీజేపీ ఆఫీస్ పై బాంబు దాడి...

బీజేపీ ఆఫీస్ పై బాంబు దాడి...

ఒడిశా రాష్ట్ర బీజేపీ ప్రధాన ఆఫీస్ పై బాంబు దాడి జరిగింది. శనివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బీజేపీ ప్రధాన ఆఫీస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఇద్దరు దుండగులను అడ్డుకున్నాడు. దీంతో ముగ్గురి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. కొద్ధి సమయానికి ఇద్దరు దుండగులు బాంబులు విసిరి అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందటంతో ఖర్వెల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.