ఇవాళే భారత్-చైనా కీలక చర్చలు.. బోర్డర్‌లో ఘర్షణలు, టెన్షన్‌..!

ఇవాళే భారత్-చైనా కీలక చర్చలు.. బోర్డర్‌లో ఘర్షణలు, టెన్షన్‌..!

భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. చుసుల్-మోల్డో సరిహద్దు వద్ద సైనిక అధికారుల చర్చలు జరగనున్నాయి. హరీందర్ సింగ్ నేతృత్వంలో భారత బృందం చర్చల్లో పాల్గొంటుంది. ఇక... భారత్ తో ఉన్న సమస్యల్ని సరైన పద్ధతిలో పరిష్కరించుకోగలమనే విశ్వాసం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. సరిహద్దు వివాదంపై లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయి చర్చలకు కొన్ని గంటల ముందు డ్రాగన్ దేశం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. లడఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ, డెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చైనా సైన్యాలు శృతిమించడంతో.. భారత్ ఆర్మీ కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ తరుణంలో రెండు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ జరగడం, చైనా సైన్యం ఆటవిక గుంపులా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది.