పాపను అమ్మకానికి పెట్టిన తండ్రి

పాపను అమ్మకానికి పెట్టిన తండ్రి

అప్పుడే పుట్టిన అభంశుభం తెలియని ఓ పాపను కన్న తండ్రే అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోచారం తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవించింది. నాలుగో సారి కూడా ఆడపిల్ల పుట్టిందని పాపను తండ్రి, అత్త మామలు పిల్లలు లేని వారికి అమ్మే ప్రయత్నం చేశారు. తల్లి వద్ద బిడ్డ లేకపోవడంతో వారిని ఆసుపత్రి సిబ్బంది ప్రశ్నించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి వద్ద నుండి తిరిగి పాపను తల్లి ఒడికి చేర్చారు అధికారులు. ఆడపిల్లలను పోషించే స్థోమత లేకే ఇలా చేశామని నిందితులు తెలిపారు. పాపను తీసుకోవడానికి ఐసీడీఎస్ అధికారుల ప్రయత్నం చేశారు. అయితే ఇవ్వడానికి కుటుంబ సభ్యుల నిరాకరించారు.