పోలవరం ప్రాజెక్టుని జగనే ప్రారంభిస్తారు !

పోలవరం ప్రాజెక్టుని జగనే ప్రారంభిస్తారు !


సంక్రాంతిలోగా టిట్కో ఇల్లు ఇవ్వకపోతే  స్వాధీనం చేసుకుంటామని అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ మంత్రి బొత్స తప్పుపట్టారు. పేదలకు ఇళ్ళు ఇద్దామని అనుకుంటే కొన్ని దుష్ట శక్తులు కోర్ట్ కి వెళ్లి అడ్డు కన్నాయని అన్నారు. అర్హులకి 300 sft ఇళ్లను ఉచితంగా నే ఇస్తామన్న అయన టీడీపీ హయాంలో కేవలం టిట్కో ఇల్లు 81 వేల ఇల్లు మాత్రమే 90 శాతం పూర్తి చేసుకున్నాయని అన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ఇక టిడిపి గురించి మాట్లాడడం అనవసరమన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టు ను జగన్ ప్రారంభిస్తారన్న ధీమా వ్యక్తం చేసారు, అలానే నిర్ధేశించిన సమయంలో లోగే ప్రోజెక్టు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడ్డారని అయన పోలవరం ప్రాజెక్టుకు నిధులు  తగ్గించడం పై కేంద్రాన్ని ఒప్పిస్తామని అన్నారు. అవసరం అయితే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చేనాటి నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు ఎంత శాతం పూర్తి అయిందో ఆ వివరాలు నాకు తెలియదన్న ఆయన తెలుసుకొని రేపు చెబుతానని అన్నారు.