'అన్న క్యాంటీన్ల'పై బొత్స కీలక ప్రకటన

'అన్న క్యాంటీన్ల'పై బొత్స కీలక ప్రకటన

పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అన్న క్యాంటీన్లను మూసివేయలేదని మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అన్న క్యాంటీన్‌ కొనసాగింపుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అన్న కాంటీన్లను మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అన్నం పెట్టే కాంటీన్లకు కూడా గతంలో పార్టీ రంగు వేశారన్న ఆయన.. కాంటీన్ రంగు మార్చితే పథకం రద్దు చేసినట్టు కాదని వివరించారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో వాటిపై పూర్తిగా ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉందున్నారాయన. అన్న క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.