పవన్ దిగజారుడు మాటలు వద్దు...బొత్స ఫైర్

పవన్ దిగజారుడు మాటలు వద్దు...బొత్స ఫైర్


జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు ఘాటుగా బదులిస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల మీద తాజాగా బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ చేస్తున్నవి పసలేని వ్యాఖ్యలని కొట్టిపారేశారు. పవన్ అనుభవ రాహిత్యానికి ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ పోలవరం రివర్స్ టెండరింగ్ అయ్యేవరకు ఆగాలని సూచించారు. రాష్ట్ర అభివృద్దిపై సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పకొచ్చారు.

పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సరియైన దారిలోనే వెళ్తోందని ఈ సందర్భంగా బొత్స సమర్థించుకున్నారు. ఇక ప్రభుత్వ వైఖరి వల్లే రాజధానిలో పెట్టుబడులు రావడం లేందంటూ జనసేనాని విమర్శలు గుప్పించారు. మరోవైపు అవరావతిలో అక్రమాలు జరిగాయని వాటిని నిగ్గుతేల్చే పనిలో పడ్డామని బొత్స చెబుతున్నారు. గత టీడీపీ పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని డానికి వైసీపీని విమర్శించడం సరికాదని బొత్స అన్నారు. వరద సమయంలో ప్రభుత్వం అనుసరించిన తీరును పవన్‌ కళ్యాణ్‌ తప్పు పట్టగా పవన్‌ దిగజారుడు మాటలు మాట్లాడ వద్దంటూ సీరియస్‌ అయ్యారు బొత్స.