బాలుడిని ఢీకొన్న బొత్స ఝాన్సీ కారు

బాలుడిని ఢీకొన్న బొత్స ఝాన్సీ కారు

ఏపీ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి కారు ఢీకొట్టడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లిలో జరిగింది.  కారు ఢీకొట్టడంతో బాలుడు రోహిత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రోహిత్ ను వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే రోహిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  ప్రమాదం అనంతరం ఝాన్సీ వేరే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనపై గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.