టీడీపీ నాలుగేళ్ల పాలనలో ఒరిగిందేమీలేదు

టీడీపీ నాలుగేళ్ల పాలనలో ఒరిగిందేమీలేదు

టీడీపీ నాలుగేళ్ల పాలనలో విజయనగరం జిల్లాకు ఓరిగింది ఏమీ లేదు అని అన్నారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఈ రోజు బొత్స మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ళ కాలంలో విజయనగరం జిల్లాను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. జిల్లాలో కోట సుందరీకరణ, విజ్జీ స్టేడియం తప్ప ఇంకేమైనా చేశారా అని విమర్శించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుజేశారన్నారు. ఈ నాలుగేళ్ళ సమయంలో కేంద్ర కేబినెట్ లో ఒక్క సారైనా కేంద్రమంత్రిగా అశోక్ చర్చించారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఆయన చర్చిస్తే.. తల దించుకుంటా అని సవాల్ విసిరారు బొత్స. రాచరికపు వ్యవస్థలో ఉన్న మీకు.. సామాన్యుడి కష్టం అక్కర్లేదా అని ఎద్దేవా చేసాడు. తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పెరు పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని గుర్తు చేశారు.

రైతులు నష్టపోతుంటే కనీసం నష్టపరిహారం అందించకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యహహరిస్తున్నారన్నారు. జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే.. ఒకటి మూసేసారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.. అవి కూడా చెల్లించలేని పరిస్థితి అని తెలిపారు. జిల్లాలో టీడీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను  ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాల నివారణకు ప్రజల్లో చైతన్యం కాదు కావాల్సింది.. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మార్పు రావాలన్నారు. మాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు నాలుగేళ్ళ అధికారంలో ఎందుకు నిరూపించలేకపోయారు. మా నీతి నిజాయితీల గురించి ప్రజలు చెప్తారు అని అన్నారు.