'వైసీపీకి 150 సీట్లు..!'

'వైసీపీకి 150 సీట్లు..!'

ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా ఇక అవి చెల్లవు... మే 23వ తేదీన వెలువడే ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ... ఎన్నికల సరళి, ఫలితాలపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన... స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న ఈవీఎంలను మేం ట్యాంపరింగ్ చేస్తామనే అనుమానాలుంటే.. సీఎం చంద్రబాబు అక్కడే పడుకోవాలని సెటైర్లు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి చంద్రబాబు చేస్తోన్న డ్రామాలు చెల్లవని.. వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు బొత్స. ఇక స్పీకర్ పై డాడి ఘటనలో అంబటి రాంబాబు అక్కడ లేకపోయినా అంబటిపై కేసులు పెట్టడం దారుణమైన విషయం అన్నారు. స్పీకర్ పై దాడి అని క్రియేట్ చేసి.. వైసీపీకి పట్టున్న గ్రామాల్లోకి రావడం అంటేనే ఇది ప్లాన్ ప్రకారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కోడెల శివప్రసాద్ ఓ చీడపురుగు.. ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొన్నప్పుడు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయలేకపోయారు.. అందుకే జనం ఇప్పుడు చితకబాదారని ఎద్దేవా చేశారు.