రాజధాని నిర్మాణం.. ఆర్ధిక భారం..!!

రాజధాని నిర్మాణం.. ఆర్ధిక భారం..!!

రాజధాని నిర్మాణం విషయంలో బొత్స సత్యన్నారాయణ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందనే.  ఆ తరువాత రాజధాని నిర్మాణం విషయంలో గందరగోళం నెలకొంది.  రాజధానిని తరలించవద్దని, రాజధాని తరలించే ప్రయత్నం చేస్తే.. పోరాటం చేస్తామని కొందరు నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  ఈరోజు బొత్స సత్యన్నారాయణ విజయనగరంలో రాజధాని నిర్మాణం విషయంపై మాట్లాడారు.  

గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.  రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, ఇటీవలే కృష్ణకు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తేనే ఆ ప్రాంతం మునిగిందని, ఒకవేళ 11 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ సలహాను నిర్లక్ష్యం చేసిందని అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ఆర్ధికంగా భారం అవుతుందని బొత్స చెప్పారు.  రాజధాని విషయంలో బొత్సా చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్ధాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని బొత్స చెప్పారు.