పబ్‌లో యువకులను చితక్కొట్టిన బౌన్సర్లు

పబ్‌లో యువకులను చితక్కొట్టిన బౌన్సర్లు

జూబ్లీ హిల్స్‌లోని ఓ పబ్‌లో 9 మంది యువకులపై బౌనర్లు దాడి చేశారు. బౌన్సర్ల చేతిలో దెబ్బలు తిని తీవ్రంగా గాయపడిన కార్తీక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్ శరత్ చంద్రలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీ కోసం పబ్‌కు వెళ్లామని వారు చెప్పారు. వాష్‌ రూమ్‌లో చేతులు తుడుచుకుంటుండగా నాలుగు టిష్యూ పేపర్లు కిందపడడంతో తమను ఓ బౌన్సర్‌ బూతులు తిట్టాడని చెప్పారు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే తోటి బౌన్సర్లతో కలిసి తమను చితకబాదాడని వాపోయారు.