వరల్డ్‌ కప్‌లో ఇదే కీలకం: ద్రావిడ్‌

వరల్డ్‌ కప్‌లో ఇదే కీలకం: ద్రావిడ్‌

ఈ వరల్డ్‌కప్‌లో బౌలింగ్‌ మెరుగ్గా చేసే జట్టే టైటిల్‌ ఫేవరెట్‌ అని లెజెండరీ క్రికెటర్‌ రాహుల్ ద్రావిడ్‌ అన్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బౌలింగ్‌ కీలకమని.. వికెట్లు పడగొడితే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని చెప్పాడు. ఈ విషయంలో భారత్ పరిస్థితి బాగానే ఉందన్న ద్రావిడ్‌.. బుమ్రా, కుల్దీప్, చాహల్‌లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సమర్థులని చెప్పాడు. ఈ మెగా టోర్నీలో ఈసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రయపడ్డాడు. 'వరల్డ్ కప్‌లో మన జట్టు కూడా ఫేవరెట్టే. మనం సెమీఫైనల్స్‌కు కచ్చితంగా వెళ్తాం' అని చెప్పాడు ద్రావిడ్‌.