చిత్తూరులో పబ్జీ కి బలైన బాలుడు..!

  చిత్తూరులో పబ్జీ కి బలైన బాలుడు..!

పబ్జీ గేమ్ కు బానిసై ఎంతో మంది తమ సమయాన్ని వృథా చేసుకుంటుండగా...మరికొందరు తమ బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఓ యువకుడు పబ్జికి బానిసై 16 లక్షలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఒక బాలుడు పబ్జీ ఆడవద్దని మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన  శ్యామ్ ప్రసాద్ (14) అనే బాలుడు తరచూ పబ్జి ఆడుతూ తన చదువును నిర్లక్ష్యం చేసాడు. రోజూ పబ్జి ఆడటం మానెయ్యాలని అతడి తల్లి తండ్రులు మందలించారు. దాంతో అతడు ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు బాలుడి తల్లి తండ్రులకు సమాచారం అందించారు. స్థానికులు బాలుడిని పలమనేరు ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.