కారు డిక్కీలో ఊపిరాడక బాలుడు మృతి 

కారు డిక్కీలో ఊపిరాడక బాలుడు మృతి 

విశాఖపట్నంలో విషాదం నెలకొంది. కారు డిక్కీలో ఊపిరాడక ఓ బాలుడు మృతిచెందాడు. నగరంలోని మల్కాపురం నేవల్‌ పార్క్ క్వార్టర్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. 
ఇవాళ ఉదయం తండ్రితోపాటు కారు సర్వీసింగ్‌కు ప్రేమ్‌కుమార్‌(8) వెళ్లాడు. గంట తర్వాత అదే కారులో తండ్రితోపాటు ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో సాయంత్రం ప్రేమ్‌కుమార్‌ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో కారులో వెతకగా.. డిక్కిలో విగతజీవిగా పడిఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.